carvn: రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నో... కార్వాన్‌ అంశాన్ని తేల్చేసిన రజత్‌కుమార్‌

  • పలు రకాల ఫిర్యాదులు చేసిన రాజకీయ పార్టీలు
  • కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లిన రాష్ట్ర అధికారులు
  • అవసరం లేదని తేల్చి చెప్పిన ఈసీఐ

ఈవీఎంలు మొరాయించడం, ఆలస్యంగా పోలింగ్‌ మొదలవ్వడం వంటి కారణాలతో హైదరాబాద్ మహానగరంలోని కార్వాన్‌ నియోజకవర్గంలో రీపోలింగ్‌ నిర్వహించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌ను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అక్కడ ఎటువంటి రీ పోలింగ్‌ ఉండదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

నియోజకవర్గం పరిధి జియాగూడ ప్రాంతంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్‌ మొదలయింది. మరో 22 పోలింగ్‌ బూత్‌ల్లో ఆలస్యంగా ఓటింగ్‌ ప్రారంభమయింది. నానల్‌నగర్‌లో రిగ్గింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగనందున, రిగ్గింగు అనుమానాలు ఉన్నందున  జియాగూడ, నానల్‌నగర్‌లో రీపోలింగ్‌ జరపాలని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి.

అయితే అక్కడి ఎన్నికల అధికారి దీనికి అంగీకరించలేదు. ఈ వివాదం కారణంగా ఎన్నికల అధికారి అక్కడి పోలింగ్‌ శాతం వివరాలు కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత సమస్య ఓ కొలిక్కి రావడంతో అధికారిక పోలింగ్‌ శాతాన్ని అందజేశారు. వివాదాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) విషయం తెలిపారు. వారి ఆదేశాల మేరకు రజత్ కుమార్ తాజా ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News