Priyanka Chopra: ప్రియాంకతో నిక్‌ది బలవంతపు వివాహమంటూ రాసిన కథనంపై క్షమాపణలు కోరిన పాత్రికేయురాలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-73b5374110d9235b8a98d1d6ccd93dfa01e0b50d.jpg)
- కథనంపై తీవ్ర విమర్శలు
- మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి
- కథనం పూర్తి బాధ్యతను తీసుకుంటున్నా
ప్రియాంక చోప్రాతో నిక్ జొనాస్ పెళ్లి బలవంతంగా జరిగిందని పేర్కొంటూ ఇటీవల న్యూయార్క్‌కు చెందిన ‘ది కట్’ మ్యాగజైన్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ‘ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్కాం ఆర్టిస్ట్’ అంటూ సదరు మ్యాగజైన్ రాసిన కథనంలో నిక్‌కు అసలు పెళ్లి ఇష్టం లేదని.. సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడని సదరు మ్యాగజైన్ కథనాన్ని రాసింది. దీనిపై ప్రియాంక, నిక్ సోదరుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో మ్యాగజైన్ పాత్రికేయురాలు మారియా స్మిత్ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. ‘నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టినందుకు ప్రియాంకా చోప్రాకు, నిక్ జొనాస్‌కు, పాఠకులకు నిజాయతీగా క్షమాపణలు చెబుతున్నా. నేను రాసిన కథనం పూర్తి బాధ్యతను తీసుకుంటున్నా. నేను తప్పు చేశా. నిజంగా క్షమించమని కోరుతున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.