Telangana: తెలంగాణలో మొత్తం 73.20 శాతం పోలింగ్ నమోదైంది!: రజత్ కుమార్

  • గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది
  • అత్యధికంగా ఆసిఫాబాద్ లో 85.9 శాతం నమోదైంది
  • హైదరాబాద్ లో నమోదైన పోలింగ్ శాతం 48.9 శాతం  

తెలంగాణలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం వివరాలను ఎట్టకేలకు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమర్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెల్లవారుజామున 3.40 గంటలకు జిల్లాల నుంచి వివరాలు అందాయని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగిందని అన్నారు. పురుషుల పోలింగ్ శాతం 72.54 అని, మహిళల పోలింగ్ శాతం 73.88 గా నమోదైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలను తెలియజేశారు. అత్యధికంగా ఆసిఫాబాద్ లో 85.9 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 48.9 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

Telangana
elections
poling
percentage
rajat kumar
  • Loading...

More Telugu News