Chandrababu: పసల బేబిని సత్కరించిన చంద్రబాబు

  • బేబి పాటకు చంద్రబాబు ఫిదా
  • బేబిని పరిచయం చేసిన మురళీ మోహన్
  • చిరంజీవి ఇంటికి పిలిచి సత్కారం
  • అభినందించిన ఏఆర్ రెహ్మాన్

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని పడిశలేరుకు చెందిన పసల బేబిని సీఎం చంద్రబాబు అభినందించారు. అలవోకగా పాటలు పాడుతూ యూట్యూబ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బేబి పాటకు చంద్రబాబు కూడా ఫిదా అయ్యారు. ఎంపీ మురళీ మోహన్, మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి.. బేబిని చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బేబి.. చంద్రబాబుకు పాట పాడి వినిపించారు. ఆమె గాత్రానికి ఫిదా అయిన సీఎం.. బేబిని అభినందించి, సత్కరించారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. బేబి మట్టిలో మాణిక్యమని.. సంగీత జ్ఞానం లేకున్నా అద్భుతంగా పాడుతున్నారన్నారు. ఆమె పాడిన పాటలు చాలా మంది మెప్పు పొందాయన్నారు. చంద్రబాబు ఆమెను సత్కరించారని వెల్లడించారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ ఆమెను అభినందించారని, కోటి, కీరవాణి తమ సినిమాల్లో అవకాశమిస్తామన్నారని తెలిపారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా బేబిని ఇంటికి పిలిచి సత్కారం చేసి, కొంత పారితోషకం కూడా ఇచ్చారని వెల్లడించారు.

Chandrababu
East Godavari District
Baby
Murali Mohan
Rajakumari
  • Loading...

More Telugu News