onteru: నాపై చేయిచేసుకున్న ఎస్సైను సస్పెండ్ చేయాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్

  • రాజేంద్ర ప్రసాద్ అనే ఎస్సై నాపై చెయ్యి చేసుకున్నారు
  • అతను టీఆర్ఎస్ పార్టీకి సపోర్టు చేశాడు
  • కొంతమంది ఎస్సైలు డబ్బు, లిక్కర్ సరఫరా చేశారు

రాజేంద్ర ప్రసాద్ అనే ఎస్సై తనపై చెయ్యి చేసుకున్నారని, అతను టీఆర్ఎస్ పార్టీకి సపోర్టు చేశాడని వంటేరు ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గజ్వేల్ లో సివిల్ డ్రెస్సులో ఉన్న కొంతమంది ఎస్సైలు డబ్బు, లిక్కర్ సరఫరా చేశారని, ఆ వ్యక్తులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈసీకి ఫిర్యాదు కూడా చేశానని చెప్పారు. అయ్యప్పమాల వేసుకున్న తమ వ్యక్తిని పోలీసులు లాఠీతో కొడితే తీవ్రంగా గాయమైందని అన్నారు. ఎస్సై రాజేంద్రప్రసాద్ ని సస్పెండ్ చేయమని తాను డిమాండ్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు.

onteru
pratap reddy
election commission
  • Loading...

More Telugu News