cpi: ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ప్రజాకూటమికి నిశ్శబ్ద ఓటింగ్ పడింది: చాడ వెంకటరెడ్డి
- ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజాకూటమికి కలిసొచ్చింది
- సోనియా సభ తర్వాత సానుకూలత మరింత పెరిగింది
- 70 నుంచి 80 స్థానాల్లో కూటమి గెలుపొందొచ్చు
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ప్రజాకూటమికి నిశ్శబ్ద ఓటింగ్ పడిందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజాకూటమికి కలిసొచ్చిందని. తెలంగాణలో సోనియా సభ తర్వాత సానుకూలత మరింత పెరిగిందని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం, నిరుద్యోగం, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కాకపోవడం, దళితులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అంశాలతో పాటు కేసీఆర్ నియంతృత్వ ధోరణి మింగుడుపడని మేధావి వర్గం ప్రజాకూటమికి మద్దతు తెలిపిందని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక పవనాలు ప్రజా కూటమికి అనుకూల పవనాలుగా మారాయని, 70 నుంచి 80 స్థానాల్లో కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.