Andhra Pradesh: ‘మనకు ఒక్క ముఖ్యమంత్రి సరిపోడనే ఇద్దరికి ఇచ్చాం’.. నెటిజన్ కు హీరో రామ్ ఫన్నీ కౌంటర్!

  • తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన రామ్
  • ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్న నటుడు
  • మాది ఆంధ్రా అన్న యువకుడికి రిప్లై

తెలంగాణ అసెంబ్లీకి నిన్న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమలాగే అందరూ ఓటు హక్కును వినియోగంచుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇదే క్రమంలో టాలీవుడ్ హీరో రామ్ వేటువేశాక చేతి వేలికున్న సిరా గుర్తును చూపుతూ ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. దానికి  ‘నాది నాదే.. మరి మీది?’ అన్న క్యాప్షన్ ను జత చేశాడు.

రామ్ పిలుపు మేరకు పలువురు తాము ఓటు వేశాక దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం రామ్ ఛాలెంజ్ కు స్పందిస్తూ ‘మాది ఆంధ్రాలే’ అని కామెంట్ పెట్టాడు. దీనికి రామ్ అంతే ఫన్నీగా స్పందించాడు. ‘అది కూడా మనదే తమ్ముడూ.. మనకు ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదనే ఇద్దరికి ఇచ్చాం. విడదీసి ఇచ్చాం తప్ప విడిపోలేదు. ఏపీ, తెలంగాణ రెండూ మనవే’ అని కౌంటర్ వేశారు. కాగా, రామ్ జవాబు ఇచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Andhra Pradesh
Telangana
hero
ram
comment
Telangana Election 2018
andhra
  • Loading...

More Telugu News