natural forming: ప్రకృతి వ్యవసాయం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోతుంది: సుభాష్ పాలేకర్
- సేంద్రీయ వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నది
- ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది
- పట్టణీకరణతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస పోతున్నారు
ప్రకృతి వ్యవసాయం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోతుందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘జీరో బడ్జెట్ నేచురల్ సిస్టమ్’ నుంచి ‘సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం’గా ఈ విధానం పేరును మార్చామని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నదని, ఈ విధానం గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తికి కారణమవుతందని, సేంద్రీయ వ్యవసాయంతో కర్బన ఉద్గారాలు ఉత్పన్నమై వాతావరణం వేడెక్కుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిదని సూచించారు. పట్టణీకరణతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస పోతున్నారని, కొందరు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.