Tamilnadu: తమిళనాడులో 'గజ' తుపాను బాధితులకు ఆది పినిశెట్టి సాయం!

  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  • సహాయక సామగ్రి పంపిణీ
  • ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు

తమిళనాడును ఇటీవల గజ తుపాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. తుపాను దెబ్బకు తమిళనాడులోని చాలా జిల్లాల్లో పంటలు నష్టపోగా, ఇళ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ సహా పలువురు నటులు తుపాను బాధితులకు తమవంతు సాయం అందజేశారు. తాజాగా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి కూడా గజ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు.

తమిళనాడులో గజ ప్రభావిత ప్రాంతాల్లో తన టీమ్ తో కలిసి ఆది పర్యటించాడు. ఈ సందర్భంగా 5 టన్నుల ఆహారం, మందులు, బెడ్ షీట్స్, దోమతెరలతో పాటు సోలార్, బ్యాటరీ లైట్లు అందజేశారు. అలాగే నాలుగు గ్రామాల్లోని 520 కుటుంబాలకు పునరావాసం కోసం అవసరమైన సామగ్రిని  ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tamilnadu
gaja
storm
aadhi pinisetty
help
compensation
victims
  • Loading...

More Telugu News