Andhra Pradesh: కన్నతండ్రి కంటే జగన్ కు కేసీఆరే ఎక్కువయ్యాడు.. వైఎస్ ను తిట్టినా స్పందించరా?: తులసిరెడ్డి

  • కేసీఆర్ ఆంధ్రాకు ప్రత్యేకహోదాను అడ్డుకున్నారు
  • ఆంధ్రాలో సీఎం కుర్చీ, తెలంగాణలో ఆస్తులు జగన్ కు కావాలి
  • ఏపీలో పోటీపై హైకమాండ్ దే తుది నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాకుండా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. సొంత తండ్రి వైఎస్ ను కేసీఆర్ దుర్భాషలాడినా జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. తండ్రి కంటే కేసీఆరే జగన్ కు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశం లో తులసిరెడ్డి మాట్లాడారు.

ఆంధ్రాలో సీఎం కుర్చీమీద, తెలంగాణలో ఆస్తుల మీద మాత్రమే జగన్ కు ప్రేమ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కలిసి ముందకు వెళ్లాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తులసిరెడ్డి చెప్పారు. ఏపీలో పొత్తుల విషయంలో హైకమాండ్ తీసుకునే నిర్ణయమే అంతిమమనీ, దానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telangana
Congress
tulasi reddy
YSRCP
Jagan
KCR
TRS
ys
  • Loading...

More Telugu News