Warangal Urban District: మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: మంత్రి ఈటల రాజేందర్‌

  • కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
  • విష ప్రచారాన్ని ప్రజలు ఆత్మగౌరవంతో తిప్పికొట్టారు
  • ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు బలాన్నిచ్చాయి

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పడబోతోందని, ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా  కమలాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విపక్షాలు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని, ధర్మం వైపు ఉండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో కుట్రలు, కుతంత్రాలు చేసినట్టే మహా కూటమిగా జతకట్టి మరోసారి వాటికి తెరదీశారని విమర్శించారు. కూటమి నాయకులు ఎన్ని విష ప్రయోగాలు చేసినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన  ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిపథంలో నడుపుతామని అన్నారు. 

Warangal Urban District
Etela Rajender
TRS win
  • Loading...

More Telugu News