Telangana: కేసీఆర్ ను ఓడించబోతున్నా.. మెజారిటీ 50,000 ఓట్లపైనే!: కాంగ్రెస్ నేత వంటేరు

  • తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు
  • రాష్ట్రానికి డిసెంబర్ 11న నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది
  • దోపిడీదారుల భరతం పడతాం

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ నేత, గజ్వేల్ ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు నిజమైన స్వాంతంత్ర్యం డిసెంబర్ 11న వస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను 50,000 మెజార్టీతో గెలవబోతున్నానని ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు.

కేసీఆర్ దెబ్బకు రాష్ట్ర సచివాలయం నాలుగేళ్లుగా మూతపడిందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తెరిపిస్తామని ప్రతాప్ రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నవారి భరతం పడతామన్నారు. గజ్వేల్ ప్రజలు తెలివైనవారనీ, నిజమైన ప్రజాస్వామ్యానికే ఓటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.

Telangana
KCR
vanteru pratap reddy
50000
votes
majority
elections2018
  • Loading...

More Telugu News