BJP: ఈవీఎంను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి... వీడియో వైరల్!

  • పాలి నుంచి పోటీపడ్డ అభ్యర్థి ఇంట ఈవీఎం
  • పోలింగ్ కేంద్రంలోని అదనపు ఈవీఎం అన్న ఈసీ
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్ 

రాజస్థాన్‌ శాసన సభ ఎన్నికలు ముగిసిన వేళ, పాలి నియోజకవర్గం నుంచి పోటీ పడిన బీజేపీ అభ్యర్థి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఇంట్లో ఈవీఎం ఉండటాన్ని గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది.

పాలి నియోజకవర్గంలో సెక్టార్ అధికారిగా ఉన్న ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను బీజేపీ అభ్యర్థి ఇంటికి తీసుకు వెళ్లినట్టు గుర్తించిన ఎన్నికల సంఘం అధికారులు, అతన్ని విధుల నుంచి తప్పించారు. స్థానిక రిటర్నింగ్ అధికారిపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఈవీఎం పోలింగ్ కేంద్రంలోని అదనపు ఈవీఎం అని ఈసీ వివరణ ఇచ్చింది.

BJP
Evm
Rajasthan
Viral
  • Error fetching data: Network response was not ok

More Telugu News