Telangana: సొంత మనుషులు వెన్నుపోటు పొడిచినా.. నా గెలుపును ఆపలేరు!: వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్

  • వర్ధన్నపేట సీటును టీజేఎస్ కు ఇచ్చిన కాంగ్రెస్
  • టీజేఎస్ నుంచి పగిడపాటి దేవయ్య పోటీ
  • టీఆర్ఎస్ పై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోటీ చేస్తున్న టీజేఎస్ నేత, ప్రజాకూటమి అభ్యర్థి పగిడపాటి దేవయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చుట్టూ ఉన్నవారు వెన్నుపోటు పొడిచినా ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనతో విసిగివేసారిన ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. తాను ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తానని దేవయ్య హామీ ఇచ్చారు. కాగా, దేవయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రజాకూటమితో పాటు సొంత టీజేఎస్ లో తీవ్రంగా చర్చ సాగుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News