Chandu Naik: నిన్న పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త మృతి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-395e55e19780b5c8bd17493beb7ca33e065407ae.jpg)
- నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన
- ఎన్నికల వేళ గొడవ పడుతుంటే లాఠీచార్జ్
- తీవ్ర గాయాలతో చందూనాయక్ మృతి
నిన్న ఎన్నికల సందర్భంగా గొడవ పడుతున్న వారిని చెదరగొట్టేందుకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో పోలీసులు లాఠీచార్జ్ చేయగా గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్త ఈ ఉదయం మృతిచెందాడు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బలగాలు లాఠీచార్జ్ చేశాయి.
ఈ ఘటనలో టీఆర్ఎస్ స్థానిక కార్యకర్త నేనావత్ చందూ నాయక్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, తలకు తగిలిన బలమైన గాయం కారణంగా పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు.