Telangana: ప్రజాకూటమి అభ్యర్థుల్లారా.. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఈవీఎంలను ఎవరూ తాకకుండా చూడండి
  • అవకతవకలకు పాల్పడే అవకాశముంది
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ నేత

తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాకూటమి అభ్యర్థులకు, కార్యకర్తలకు సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ఎవరూ తాకకుండా, వాటిలో మార్పులు చేర్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

ఈవీఎంల రవాణాతో పాటు దాచిపెట్టిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎంలను కౌంటింగ్ కోసం పంపేవరకూ ప్రజాకూటమి నేతలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మార్గమధ్యంలో ఎక్కడైనా అవకతవకలు జరిగే అవకాశముందని, నేతలంతా అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ట్వీట్ చేశారు.

Telangana
Congress
Uttam Kumar Reddy
Mahakutami
warning
  • Loading...

More Telugu News