AIR: ఆలిండియా రేడియోలో లైంగిక వేధింపులు నిజమే!

  • ఉన్నతాధికారిపై 9 మంది మహిళల ఫిర్యాదు
  • డిమోట్ చేస్తున్నట్టు ప్రకటించిన క్రమశిక్షణా కమిటీ
  • రెండు స్టేజ్ ల పే స్కేల్ కుదింపు కూడా

ఆలిండియా రేడియో అధికారిపై 9 మంది మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమేనని జాతీయ మహిళా కమిషన్ నేడు తేల్చింది. ఈ మేరకు మహిళా కమిషన్ నివేదికను ఇస్తూ, అతన్ని డిమోట్ చేస్తున్నామని, అతని వేతనాన్ని తగ్గిస్తున్నామని వెల్లడించింది.

"మహిళా కమిషన్ చేసిన సిఫార్సులను ఏఐఆర్ క్రమశిక్షణా కమిటీ అంగీకరించింది. అతనిపై జరిమానాను విధించడంతో పాటు పే స్కేలును రెండు స్టేజ్ లు తగ్గించేందుకు కూడా నిర్ణయించింది" అని మహిళా కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

సదరు అధికారిపై మొత్తం 9 మంది మహిళలు ఫిర్యాదు చేశారు. వీరిలో న్యూస్ రీడర్లు, యాంకర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. నవంబర్ 12వ తేదీన ఇతనిపై ఫిర్యాదులు రాగా, ఆపై నేషనల్ ఉమెన్ కమిషన్ రంగంలోకి దిగి విచారించింది. కాగా, ప్రసార భారతిలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, మహిళలు సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News