warangal district: పాలకుర్తిలో నేను ఘన విజయం సాధిస్తా...మెజార్టీ 50 వేల పైమాటే!: ఎర్రబెల్లి ధీమా

  • నేను ప్రజల మనిషిని కావున నన్నే కోరుకుంటున్నారు
  • నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చా
  • ఇవే నా విజయానికి బాటలు వేయనున్నాయి

వరంగల్‌ జిల్లా పాలకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు తన విజయంపై ధీమాగా వున్నారు. ‘నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి అవసరాలను తీర్చడం, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడం...ఇవే నాకు కలిసి వచ్చే అంశాలు. ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. కావున యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం’ అని చెప్పారు.

ఆయా మండలాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించి, కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు యాభై వేలకు పైగానే మెజార్టీ వస్తుందని తెలిపారు. తాను ప్రజల కష్టాలు తెలిసిన వాడినని, వారికి అండగా ఉన్నందున తననే కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క దేవరుప్పుల మండలం నుంచే 8వేల నుంచి 10 వేల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తన బాధ్యత మరింత పెరిగిందని, తన కోసం పనిచేసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని తెలిపారు. 

warangal district
palakurthi
yerrabelli dayakara rao
  • Loading...

More Telugu News