chiranjeevi: నయనతారనే కొరటాల ఫిక్స్ చేశాడట!

  • చిరూతో కొరటాల శివ మూవీ 
  • మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • జనవరిలో పూజా కార్యక్రమాలు  

కొరటాల శివ తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నారనేది తాజా సమాచారం.

ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరిలో తెలుగు .. తమిళ  .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న కథానాయిక నయనతార మాత్రమే. అందుకనే 'సైరా' కోసం ఆమెనే తీసుకున్నారు. కొరటాల సినిమా విషయంలోను కథానాయిక సమస్య తలెత్తింది. పాత్ర పరంగాను .. తన క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి అనడంతో, ఆమెనే కొరటాల ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు.    

chiranjeevi
nayanatara
  • Loading...

More Telugu News