Andhra Pradesh: విజయవాడలో తొలి ఫైవ్ స్టార్ హోటల్.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం!

  • విజయవాడలో అడుగుపెట్టిన నోవాటెల్
  • రూ.150 కోట్లతో నిర్మాణం పూర్తి
  • పర్యావరణహిత సాంకేతికతతో నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తొలి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత నోవాటెల్ గ్రూప్ నిర్మించిన హోటల్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. నోవాటెల్ గ్రూపు దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఈ హోటల్ ను నిర్మించింది.

ఈ హోటల్ ను పర్యావరణ హితంగా, తక్కువ కాలుష్యం వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ విషయమై నోవాటెల్ ప్రతినిధులు మాట్లాడుతూ..అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెం వద్ద రూ.40 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడలో నోవాటెల్ మరో సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Vijayawada
5 stra hotel
Chandrababu
inaguaration
tomorrow
  • Loading...

More Telugu News