Krishna River: పోలి పాడ్యమి... కృష్ణానదికి పోటెత్తిన భక్తులు!

  • నదీ స్నానాలను చేస్తున్న భక్తులు
  • కృష్ణానదిలో వేలాది మంది పుణ్యస్నానాలు
  • గోదావరి, సముద్ర తీరంలో కూడా

కార్తీక మాసం చివరి రోజు కావడం, పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు నదీ స్నానాలు చేసి, దీపాలను వదిలి పూజలు చేసేందుకు పోటెత్తారు. విజయవాడ కృష్ణానదితో పాటు కోస్తా తీరంలోని అన్ని సముద్ర తీరాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు వీలుపడని భక్తులు ఈ ఒక్కరోజూ 31 ఒత్తులతో అరటి దొప్పల్లో దీపాలను పెట్టి నదిలోకి వదిలితే మంచిదని ప్రజల విశ్వాసం. మరోవైపు గోదావరి నదిలో సైతం వేలాది మంది పుణ్య స్నానాలు చేశారు. దీంతో బాసర, భద్రాచలం, కోవూరు తదితర ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సందడి నెలకొంది.

Krishna River
Godavari
Vijayawada
Poli Padyami
  • Loading...

More Telugu News