Chandrababu: తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఆరా!

  • కేంద్ర బృందంతో సమావేశం
  • ఊపిరి సలపని పనులతో బిజీ
  • అయినా, ఎప్పటికప్పుడు ఆరా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలపై ఆరా తీశారు. పోలింగ్ సరళి, పోలింగ్ శాతం వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం తనను కలిసిన పార్టీ నేతలతో ఎన్నికల తీరుపై చర్చించారు. సభలు, సమావేశాలతో చంద్రబాబు బిజీగా ఉంటూనే తెలంగాణ ఎన్నికలపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరవు సాయంతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కేంద్ర బృందం ఏపీకి వచ్చింది. ఆ బృందంతో సమావేశమైన చంద్రబాబు పలు విషయాలపై వారితో చర్చించారు. దీంతో పాటు ఇతర అధికారిక కార్యక్రమాల్లోనూ ఊపిరి సలపకుండా గడిపారు. అంత బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.

Chandrababu
Andhra Pradesh
Telangana
Polling
Elections
  • Loading...

More Telugu News