lagadapati: పది సీట్లు అటూఇటూగా 35 వస్తాయని లగడపాటి చెబితే ఎలా నమ్ముతాం?: టీఆర్ఎస్ నేత సీతారాం నాయక్

  • లగడపాటి తడబడుతున్నాడు
  • ధైర్యంగా చెప్పలేకపోతున్నారు
  • కూటమికి 65 స్థానాలకు అటూఇటూగా వస్తాయట!

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ పై టీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ అనుమానం వ్యక్తం చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన సర్వేల్లో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పాయని అన్నారు. మూడు నెలల నుంచి తాను సర్వే చేస్తున్నానని లగడపాటి చెప్పారని, మాట్లాడేటప్పుడు ఎంతో తడబడుతున్నాడని, ధైర్యంగా చెప్పలేకపోతున్నారని అన్నారు.

ప్రజాకూటమికి 65 స్థానాలకు అటూఇటూగా వస్తాయని చెబుతున్నారని, ఆయనిస్తే అయ్యేది కాదు, తాము తీసుకొంటే వచ్చేవి కాదని అన్నారు. ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్స్ లో వేసేశారని, ఇంక ఎవరూ ఏం చేయలేరని, ఎవరి తలరాతనూ మార్చలేరని అన్నారు. టీఆర్ఎస్ తలరాతను కూటమి మార్చలేదని, కూటమి తలరాతను ఏం చేయాలో అది చేశామని వ్యాఖ్యానించారు.

మీడియా సమావేశంలో ఏ ప్రశ్న అడిగినా లగడపాటి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. పది సీట్లు అటూఇటూగా టీఆర్ఎస్ కు  35 స్థానాలొస్తాయని చెబుతున్న లగడపాటి సర్వేకు క్రెడిబులిటి ఏముంది?  ఎవరు నమ్ముతారు? అని ఆయన ప్రశ్నించారు.

lagadapati
TRS
sitaram naik
election
survey
  • Loading...

More Telugu News