modi: మోదీ పాలనలోని ఈవీఎంలకు రహస్యశక్తులున్నాయి.. జాగ్రత్త!: రాహుల్ గాంధీ

  • మధ్యప్రదేశ్ లో ఈవీఎంలున్న బస్సును ఎత్తుకెళ్లారు
  • పోలింగ్ పూర్తయిందని ఊపిరి పీల్చుకుంటే కుదరదు
  • కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

మోదీ పాలనలో భారతదేశంలోని ఈవీఎంలకు రహస్యశక్తులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన అనంతరం రాహుల్ ట్వీట్లు చేశారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిందని ఊపిరి పీల్చుకుంటే కుదరదని, కాంగ్రెస్ కార్యకర్తలు
అప్రమత్తంగా ఉండాలని రాహుల్ అన్నారు.

ఈ సందర్భంగా, మధ్యప్రదేశ్ లో పోలింగ్ అనంతరం ఈవీఎంలు ఉన్న బస్సును కొందరు దొంగిలించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, గత నెలాఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని ఈవీఎంలు సేకరణ కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న వార్తల నేపథ్యంలోనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

modi
Rahul Gandhi
Madhya Pradesh
evm`s
  • Loading...

More Telugu News