TRS: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది: కేటీఆర్

  • మా వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయి
  • ప్రభుత్వంపై ట్రెండ్స్ చాలా సానుకూలంగా ఉన్నాయి
  • 2/3 మెజారిటీతో గెలవనున్నాం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ అగ్రనేత కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తమ వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రభుత్వంపై ట్రెండ్స్ చాలా సానుకూలంగా ఉన్నాయని, 2/3 మెజారిటీతో గెలవనున్నామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ నాయకత్వాన్ని ఎక్కువగా విశ్వసించారు: కడియం శ్రీహరి

టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఎక్కువగా విశ్వసించారని, ఆయన నాయకత్వంలో ప్రజా హక్కులు పరిరక్షించబడతాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే నదీజలాల వాటాను దక్కించుకోగలమని ప్రజలు భావించి, తమ అభ్యర్థులకు ఓటు వేశారని అన్నారు. తమ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు అనుభవానికి వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తాము ప్రకటించిన మేనిఫెస్టో కూడా కేసీఆర్ తప్పకుండా అమలు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

TRS
KTR
elections
win
  • Loading...

More Telugu News