andhra octopus: మరో రెండు గంటల్లో 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి సర్వే ఫలితాలు!

  • ఎవరికెన్ని స్థానాలొస్తాయో చెప్పనున్న లగడపాటి
  • రాత్రి 7 గంటలకు మీడియా సమావేశం
  • పూర్తి సర్వే ఫలితాలను వెల్లడించనున్న ఆంధ్రా ఆక్టోపస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే ఫలితాలను మరో రెండు గంటల్లో ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే, తన సర్వేలోని పాక్షిక వివరాలను వెల్లడించిన ఆయన, పూర్తి సర్వే ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి ఇటీవల అభిప్రాయపడ్డారు.  

andhra octopus
lagadapati
Telangana
elections
  • Loading...

More Telugu News