Hyderabad: ఇది అర్బన్ ఓటర్లకు సిగ్గుచేటు: దర్శకుడు కొరటాల శివ

  • హైదరాబాద్ కు ఏం జరుగుతోంది
  • 3 గంటల వరకు నమోదైన పోలింగ్ 35 శాతమే
  • ఓ ట్వీట్ లో కొరటాల అసంతృప్తి

హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ కు ఏం జరుగుతోంది.. మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు 35 శాతం పోలింగ్ నమోదైందని, ఇది అర్బన్ ఓటర్లకు సిగ్గుచేటైన విషయమని అన్నారు. కాగా, తెలంగాణలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 116 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.

Hyderabad
elections
Koratala Siva
  • Loading...

More Telugu News