Telangana: తెలంగాణలో కాసేపట్లో ముగియనున్న పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్ర ఉత్కంఠ

  • 5 గంటలకు ముగియనున్న పోలింగ్ ప్రక్రియ
  • వెంటనే వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్
  • ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజలు

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ సమయానికి పోలింగ్ బూత్ కు చేరుకున్న ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. 5 గంటల తర్వాత వచ్చే ఓటర్లను బూత్ లోకి అనుమతించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై భౌతిక దాడి ఘటన మాత్రం అలజడి రేపింది.

మరోవైపు, 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ లగడపాటి ప్రకటించిన కొద్ది మేర ఫలితాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పుట్టించాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో వెల్లడి కానున్న వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కోసం తెలుగు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Telangana
polling
exit polls
  • Loading...

More Telugu News