hyderabad: రిగ్గింగ్ ఆరోపణలు.. పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ!

  •   ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల పరస్పర ఆరోపణలు
  • అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది
  • పోలీసుల అదుపులో ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలు

రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్ పురా, యాకుత్ పురాలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాజకీయపార్టీలకు చెందిన వారు, బయట వ్యక్తుల నుంచి తమకు ఫిర్యాదులు అందిన వెంటనే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఎక్కడా రిగ్గింగ్ జరగడం లేదని, ప్రజలు వచ్చి తమ ఓట్లు వేసి వెళుతున్నారని చెప్పారు.

hyderabad
yakutpura
mbt
mim
  • Loading...

More Telugu News