film nagar: ఓటు హక్కు వినియోగించుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

  • ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఓటేసిన సానియా
  • ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో   ఓట్లు గల్లంతు

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తన ఓటు వేశారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాగా, సానియా-షోయబ్ మాలిక్ దంపతులకు ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, నగరంలోని ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వెయ్యికి పైగా ఓట్లు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో వారు వెనుదిరిగారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు లేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు.

film nagar
elections
Sania Mirza
tennis star
  • Loading...

More Telugu News