kodangal: కొడంగల్ లోని పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత!

  • మూడో నంబర్ మీట నొక్కమని పోలింగ్ సిబ్బంది ఒత్తిడి
  • కాంగ్రెస్ నేతల ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితి
  • అక్కడికి చేరుకున్న పోలీస్ బలగాలు

టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి 233 పోలింగ్ కేంద్రంలో మూడో నంబర్ మీట నొక్కమని పోలింగ్ సిబ్బంది మహిళా, వృద్ధ ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.8 శాతం పోలింగ్ నమోదైంది.

kodangal
congress
TRS
  • Loading...

More Telugu News