vijayendra prasad: చైతూ కోసం రంగంలోకి దిగిన 'బాహుబలి' రచయిత

  • వరుస పరాజయాలతో చైతూ 
  • సీరియస్ గా తీసుకున్న నాగ్ 
  • విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తోన్న కథ

ఇటీవలి కాలంలో నాగచైతన్య చేసిన సినిమాలు ఆయనకి .. అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. 'శైలజా రెడ్డి అల్లుడు' మాత్రం చైతూ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని నాగార్జున భావించారు. కానీ ఆ సినిమా కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది. దాంతో చైతూ కెరియర్ పై నాగార్జున ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.చైతూ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కథను సిద్ధం చేయమని ఆయన రచయిత విజయేంద్ర ప్రసాద్ ను కోరారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి .. నాగార్జునకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అద్భుతమైన కథలతో అసాధారణమైన విజయాలను అందించిన అనుభవం విజయేంద్ర ప్రసాద్ కి వుంది. నాగార్జున కోరిక మేరకు యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఒక కథను సిద్ధం చేస్తున్నారట. కథ పూర్తయిన తరువాత దానిని ఏ దర్శకుడి చేతిలో పెట్టాలనేది నాగార్జున నిర్ణయిస్తారట. ప్రస్తుతం చైతూ 'మజిలి' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.      

vijayendra prasad
chaitu
  • Loading...

More Telugu News