polling: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటు వేసిన సినీ ప్రముఖులు వీరే

  • ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు సినీ ప్రముఖులు
  • శేరిలింగంపల్లిలో ఓటు వేసిన కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల
  • ఓటు హక్కును వినియోగించుకున్న నరేష్, హీరో వేణు

హైదరాబాదులో పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 44 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు సినీ ప్రముఖులు పోలింగ్ స్టేషన్లకు వచ్చి,తమ ఓటును వినియోగించుకుని, ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ స్టేషన్లు టాలీవుడ్ గ్లామర్ తో కళకళలాడుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా పలువురు సినీ స్టార్లు ఓటు వేశారు. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్, హీరో వేణు దంపతులు ఈ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

polling
tollywood
telangana
  • Loading...

More Telugu News