KCR: నాకు ఏ మాత్రం డౌట్ లేదు: కేసీఆర్

- చింతమడకలో ఓటేసిన కేసీఆర్
- విజయం సాధించేది టీఆర్ఎస్సే
- ఓటేసిన అనంతరం మీడియాతో కేసీఆర్
ఈ ఉదయం సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని చింతమడక గ్రామానికి తన భార్యతో కలసి వచ్చిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖరరావు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, ఇతర ఓటర్లకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతో కేవలం 5 నిమిషాల్లో కేసీఆర్, తన ఓటును వేసేసి వెళ్లిపోయారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో విజయం సాధించబోయేది టీఆర్ఎస్సేనని అన్నారు. భారీ మెజారిటీతో తాము గెలవబోతున్నామని, ఈ విషయం సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడవుతుందని తెలిపారు.


