Namrata: నమ్రతతో కలసి వచ్చి ఓటేసిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... వీడియో ఇదిగో!

  • జూబ్లీహిల్స్ లో ఓటేసిన మహేష్ బాబు
  • కాసేపు క్యూలైన్ లో వేచి చూసిన వైనం
  • సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ప్రయత్నం

హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ రాగా, అభిమానులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. మహేష్ కొద్దిసేపే క్యూ లైన్ లో నిలబడ్డారు. అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోవడం, మీడియా ఆయన చుట్టూ చేరడంతో, లోపలికి తీసుకెళ్లిన అధికారులు, ఓటు వేయించారు. అభిమానులు, మీడియాను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Namrata
Mahesh Babu
Video
Vote
  • Error fetching data: Network response was not ok

More Telugu News