Tollywood: దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం.. అడ్డుకున్న ఓటర్లు.. కోపంగా వెళ్లిపోయిన దర్శకేంద్రుడు

  • ఫిలింనగర్‌లో ఓటేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు
  • నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ప్రయత్నం
  • అడ్డుకున్న ఓటర్లు

ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావును ఓటర్లు అడ్డుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొద్దిసేపటి క్రితం ఫిలింనగర్‌లోని పోలింగ్ బూత్‌కు రాఘవేంద్రరావు చేరుకున్నారు. నేరుగా బూత్‌లోకి వెళ్తున్న ఆయనను గమనించిన ఓటర్లు అడ్డుకున్నారు. అందరూ క్యూలో నిల్చుంటే మీరు నేరుగా బూత్‌లోకి ఎలా వెళ్తారంటూ నిలదీశారు. దీనిని అవమానంగా భావించిన ఆయన ఓటు వేయకుండానే వెళ్లిపోయారు.

గతంలో చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆయన క్యూలో వెళ్లి ఓటేశారు. అయితే, రాఘవేంద్రరావు మాత్రం ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఆయన తీరును పలువురు తప్పుబడుతున్నారు. అడిగినందుకు ఓటు వేయకుండా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

Tollywood
Raghavendra Rao
Director
Vote
Film nagar
Hyderabad
  • Loading...

More Telugu News