Arjun Ram Meghawal: కిక్కిరిసిన క్యూలైన్లో తనవంతు కోసం నిలబడ్డ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్

  • బికనీర్ లోని 172 పోలింగ్ బూత్ లో ఓటు
  • అప్పటికే వేచి చూస్తున్న 200 మంది ఓటర్లు
  • క్యూలైన్లో 9 గంటల నుంచి నిలబడివున్న అర్జున్ రామ్

రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్, కిక్కిరిసిన క్యూలైన్లో చాలాసేపటి నుంచి తన వంతు కోసం వేచిచూస్తున్నారు. బికనీర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 172 వద్దకు ఆయన ఓటేసేందుకు వచ్చిన సమయానికే సుమారు 200 మందికి పైగా ఓటర్లు క్యూలైన్ లో వేచివున్నారు. దీంతో ఆయన ఉదయం 9 గంటల సమయం నుంచి వేచి చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్, తెలంగాణల్లో వీఐపీ అయినా, వీవీఐపీ అయినా, సామాన్య ఓటర్లతో సమానంగా క్యూ లైన్లలో నిలబడి, వేచి చూసి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటుండటం గమనార్హం.

Arjun Ram Meghawal
Voter
Queue Line
Rajasthan
Bikaner
  • Loading...

More Telugu News