Stone Attack: కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై రాళ్లదాడి... తీవ్రగాయాలు... నిమ్స్ కు తరలింపు!

  • రాళ్లదాడితో తీవ్ర కలకలం
  • పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన చల్లా
  • బీజేపీ నేతలే దాడి చేశారని ఆరోపణలు

కాంగ్రెస్ నేత, కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా, ఆమనగల్ మండలం, జంగారెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లగా, గుర్తు తెలియని దుంగడులు ఆయన లక్ష్యంగా రాళ్లు విసిరారు.

ఈ దాడిలో వంశీచంద్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన తలకు, చేతులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ముక్కులో నుంచి రక్తం కూడా కారుతోందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ లో హుటాహుటిన హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈ దాడి బీజేపీ కార్యకర్తలే చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Stone Attack
Challa Vamsichandreddy
Kalvakurtui
BJP
Congress
  • Loading...

More Telugu News