Rajasthan: తెలంగాణ కన్నా ముందున్న రాజస్థాన్ ఓటర్లు!
- ఉదయం 11 గంటల సమయానికి తెలంగాణలో 17 శాతం ఓట్లు పోల్
- రాజస్థాన్ లో ఓటేసిన 21.89 శాతం మంది
- పోలింగ్ శాతం పెరిగే అవకాశం
ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడే విషయంలో తెలంగాణ ఓటర్ల కన్నా రాజస్థాన్ ఓటర్లు ముందున్నారు. ఈ ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు. ఈ ఉదయం 11 గంటల సమయానికి తెలంగాణలో 17 శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తుండగా, రాజస్థాన్ లో మాత్రం 21.89 శాతం పోలింగ్ నమోదైంది. రాజస్థాన్ లో ఈ దఫా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని, తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Voter turnout recorded till 11.00 am in #RajasthanElections2018 is 21.89%
— ANI (@ANI) December 7, 2018