Varun Tej: ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది... ఇక్కడ ఇబ్బందిగా ఉంది: ఎన్నికల ఏర్పాట్లపై హీరో వరుణ్ తేజ్

  • ఓటేసేందుకు కుటుంబీకులతో వచ్చిన వరుణ్ తేజ్
  • గంటన్నరకు పైగా క్యూలైన్లో వేచివున్న మెగా హీరో
  • తదుపరి ఎన్నికల్లో మరింత మంచి ఏర్పాట్లు చేయాలని సలహా

ఈ ఉదయం ఓటేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్, పోలింగ్ ఏర్పాట్లపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశాడు. తాను గంటన్నరకు పైగా క్యూలైన్లో వేచి వున్నానని చెప్పిన ఆయన, ఏర్పాట్లు ఇంకాస్త బాగా చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

క్యూలైన్లో నిలబడేందుకు తనకు అభ్యంతరం లేదని, కానీ వయసు మళ్లిన వారు, ఫ్యామిలీతో వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాస్త వేగంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగితే బాగుంటుందని చెప్పాడు. తదుపరి ఎన్నికల్లో మరింత మంచి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నట్టు వరుణ్ తేజ్ వెల్లడించాడు. చాలా సేపు నిలబడటం కొంతమందికి సాధ్యం కాదని అన్నారు. యువత ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాడు. 

Varun Tej
Vote
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News