Srikant: తొలిసారి ఓటేసి సంబరపడిన నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్!

  • 'నిర్మలా కాన్వెంట్' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్
  • శ్రీకాంత్, ఊహలతో కలసి వచ్చి ఓటేసిన రోషన్
  • చాలా ఆనందంగా ఉందని వెల్లడి

తొలిసారి ఓటేస్తే వచ్చే ఆనందమే వేరు. మొదటిసారి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి, ఆపై వేలికి సిరా చుక్క పెట్టించుకుని బయటకు వచ్చిన తరువాత ఎంతో తృప్తిగా ఉంటుంది. నేడు అదే తృప్తిలో ఉన్నాడు నటుడు శ్రీకాంత్, ఊహల కుమారుడు రోషన్.

'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు కాగా, నేడు జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. ఆపై కెమెరాలకు తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ పోజులిచ్చాడు. మొట్టమొదటిసారి ఓటు వేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా రోషన్ వ్యాఖ్యానించాడు. 

Srikant
Ooha
Roshan
Vote
Telangana
  • Loading...

More Telugu News