Chiranjeevi: ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన రాం చరణ్.. !

  • విదేశాల్లో ఉన్న రాం చరణ్
  • అందుకే రాలేకపోయాడన్న చిరంజీవి
  • ఓటేయకుంటే ప్రశ్నించే హక్కు ఉండదన్న మెగాస్టార్

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు.

 రాం చరణ్ ఎందుకు ఓటేయలేకపోయాడనే విషయాన్ని చిరంజీవి విలేకరులకు వివరించారు. రాం చరణ్ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, అందుకే రాలేకపోయాడని వివరించారు. తాను మాత్రం ఉదయాన్నే భార్య, కుమార్తెలతో కలిసి వచ్చి ఓటు వేశానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది వారి ధర్మమని చిరు అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటేయాలని, లేదంటే ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామని అన్నారు.

Chiranjeevi
Ramcharan
Elections
Tollywood
Vote
  • Loading...

More Telugu News