stabs: భార్యను చంపి కుమారుడి కళ్ల ముందే గొంతు కోసుకుని భర్త ఆత్మహత్య

  • హోటల్‌లో గొడవ పడిన భార్యాభర్తలు
  • కుమారుడి కళ్లముందే తల్లిని పొడిచి చంపిన తండ్రి
  • అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్య

భార్యను చంపి కుమారుడి కళ్ల ముందే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మహాబలేశ్వర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వృత్తిపరంగా డ్రైవర్ అయిన అనిల్ షిండే (34).. భార్య సీమా (30), 11 ఏళ్ల కుమారుడితో కలిసి బుధవారం హిల్ స్టేషన్ మహాబలేశ్వర్‌కు వచ్చాడు.

అక్కడ ఓ హోటల్‌లో రూము తీసుకున్న వీరి మధ్య రాత్రి గొడవ జరిగింది. అప్పటికి వారి కుమారుడు నిద్రపోతున్నాడు. ఉదయం అతడు నిద్ర లేచేసరికి తల్లిని కత్తితో పొడుస్తున్న తండ్రిని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. తర్వాత తేరుకుని ఆపాలంటూ అరిచాడు. అయితే, కుమారుడి అరుపులు వినిపించుకోని షిండే భార్యను చంపిన అనంతరం కుమారుడివైపు తిరిగి తన గొంతును కోసుకున్నాడు. దీంతో భయపడిన కుర్రాడు వెంటనే గది నుంచి బయటకు పరిగెత్తి హోటల్ సిబ్బందికి విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

stabs
hotel room
Maharashtra
Mahabaleshwar
wife
Crime News
  • Loading...

More Telugu News