India: తిప్పుతున్న అశ్విన్... మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా!

  • తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసిన భారత్
  • 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
  • రెండు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మేజిక్ చూపుతున్నాడు. ఈ ఉదయం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించి మూడు వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. ఓపెనర్లలో ఫించ్ ని ఇషాంత్ శర్మ, హారిస్ ను రవిచంద్రన్ ఆశ్విన్ పెవీలియన్ కు పంపారు.

ఆపై మార్ష్ ను అశ్విన్ తన బాల్ తో బురిడీ కొట్టించాడు.  ప్రస్తుతం ఖావాజా 26 పరుగులతో, హాండ్స్ కూంబ్ 7 పరుగులతో క్రీజులో ఉండగా, ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు. నిన్న ఆట తొలి రోజులో పుజారా (123) అద్భుత ఆటతీరు పుణ్యమాని 250 పరుగులు చేసి పరువు నిలుపుకున్న భారత జట్టులో నేడు బౌలర్లు రాణించాల్సివుంది.

India
Australia
Ravichandran Ashwin
Cricket
  • Loading...

More Telugu News