Kukatpalli: మెహిదీపట్నంలో ఓటేసి కూకట్ పల్లికి వెళ్లిపోయిన నందమూరి సుహాసిని!

  • మెహిదీపట్నంలో ఓటేసిన సుహాసిని
  • కూకట్ పల్లి నుంచి ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలో
  • పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సుహాసిని

హైదరాబాద్ పరిధిలోని కూకట్‌ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బదిలో దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈ ఉదయం మెహిదీపట్నంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఉదయం 7.15 గంటల సమయంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఓటేసిన అనంతరం, తాను పోటీ చేస్తున్న కూకట్‌ పల్లి ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె పోలింగ్ బూత్ లను సందర్శిస్తూ, పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. కూకట్ పల్లిలో సుహాసినికి, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఈ నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎవరు విజయం సాధిస్తారన్న విషయమై ఆసక్తి నెలకొనివుంది.

Kukatpalli
Suhasini
Polling
Vote
  • Loading...

More Telugu News