Vijay bhaskar: హెల్మెట్ ధరించని తమిళనాడు మంత్రి.. నోటీసులు జారీ చేసిన కోర్టు

  • హెల్మెట్ ధరించని మంత్రి, కార్యకర్తలు, వలంటీర్లు
  • రోడ్డుపై నిరసన చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఎమ్మెల్యే
  • కోర్టుకెళ్లిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి

హెల్మెట్ ధరించకుండా బైక్‌పై ప్రయాణించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పుదుకొట్టేలో ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విజయ్ భాస్కర్, ఏఐఏడీఎంకే కార్యకర్తలు, వలంటీర్లు హెల్మెట్లు ధరించలేదని ట్రాఫిక్ రామస్వామి అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశాడు.

ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వీరు ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. అలాగే, ‘సర్కార్’ సినిమా విడుదల సమయంలో మధురై థియేటర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రాజన్ చెల్లప్ప చేపట్టిన ఆందోళన వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యారని, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ రామస్వామి దరఖాస్తును పరిశీలించిన కోర్టు మంత్రి విజయ్ భాస్కర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే చెల్లప్పకు నోటీసులు జారీ చేసింది.

Vijay bhaskar
Tamil Nadu
Traffic Ramaswamy
Helmet
Madras high court
  • Loading...

More Telugu News