Koratala Siva: అభిమానులకు కొరటాల ఎన్నికల మెసేజ్!

  • ఆఫ్‌స్క్రీన్‌లోనూ కొరటాల మెసేజ్
  • భవిష్యత్తు కోసం ఛార్జ్‌ తీసుకోండి
  • ధర్మం కోసం బాధ్యతగా ఉండండి

తెలంగాణలో ప్రచార హోరు నిన్నటి సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని మరికొన్ని గంటల్లో ఓటర్లు నిర్ణయించబోతున్నారు. రేపు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువను, వేయాల్సిన బాధ్యతను సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలు, విద్యావంతులు ప్రజలకు వెల్లడిస్తున్నారు.

తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా ఓటర్లకు సందేశమిచ్చారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజ్‌ను ఇచ్చినట్టే.. ఆఫ్‌స్క్ర్రీన్‌లోనూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మెసేజ్ ఇచ్చారు. ‘‘మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం ఇప్పుడే ఛార్జ్‌ తీసుకోండి. మీ హక్కులు, ధర్మం కోసం ఖచ్చితంగా బాధ్యతగా ఉండండి. దయచేసి ఓటు వేయండి’’ అంటూ ట్విట్టర్ ద్వారా కొరటాల అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Koratala Siva
Elections
Telangana
Vote
Twitter
  • Loading...

More Telugu News