nandamuri suhasini: డీసీపీ, ఏసీపీలపై ఈసీకి నందమూరి సుహాసిని ఫిర్యాదు

  • డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ సురేంద్రలపై ఫిర్యాదు
  • టీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తున్నారంటూ ఆరోపణ
  • ఓల్డ్ బోయిన్ పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని విన్నపం

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్ పల్లి ఏసీపీ సురేంద్రలపై ఎన్నికల సంఘానికి కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వీరు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవరంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబంలో ఉన్న మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని తెలిపారు. ఓల్డ్ బోయిన్ పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరారు. 

nandamuri suhasini
kukatpalli
madhavaram krishna rao
ec
dcp
acp
  • Loading...

More Telugu News