Andhra Pradesh: 2019 ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్!

  • రాజకీయాలు స్వార్థపూరితంగా మారాయి
  • అందుకే నేతలు పార్టీలను నడుపుతున్నారు
  • అనంతపురంలో మీడియాతో మాట్లాడిన పవన్

రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలను నడుపుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రజల సంక్షేమం గురించి నేతలు ఆలోచించడం లేదని విమర్శించారు. మహిళలు, యువతే లక్ష్యంగా జనసేన పార్టీని నడుపుతున్నామని పవన్ అన్నారు. యువత, మహిళలతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. అనంతపురం జిల్లాలో ‘జనసేన పోరాట యాత్ర’లో పాల్గొంటున్న పవన్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.

2019 ఆంధ్ర్రప్రదేశ్, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో వచ్చే ఫిబ్రవరిలో వెల్లడిస్తానన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన రెయిన్ గన్లతో అనంతపురం రైతులకు ఏమాత్రం లాభం చేకూరలేదని విమర్శించారు. అనంతపురంలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అసలు అసెంబ్లీకే వెళ్లడం లేదనీ, కరవుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు.

Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Anantapur District
press mmet
politics
Jagan
Chandrababu
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News