Telangana: ఇంటికే పరిమితమైన రేవంత్ రెడ్డి... ప్రస్తుతం కొడంగల్ పరిస్థితి ఇది!

  • ముగిసిన ఎన్నికల ప్రచారం
  • కొడంగల్ లో కేంద్ర బలగాల కవాతు
  • ఇంట్లోనే ముఖ్యనేతలతో రేవంత్ సమావేశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసిన తరువాత ప్రధాన నేతలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దాదాపు నెలన్నరగా బిజీగా ప్రచారం చేస్తూ గడిపిన కొడంగల్ ప్రజా కూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి, నేడు ఇంటికే పరిమితం అయ్యారు.

కొడంగల్ నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండటంతో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఉదయం పోలీసులు, కేంద్ర బలగాలు పట్టణంలో కవాతు నిర్వహించాయి. ప్రస్తుతం తన ఇంట్లో ఉన్న రేవంత్ రెడ్డి, తన అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశమై, పోలింగ్ ఏర్పాట్లు, ఏజంట్ల వివరాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

Telangana
Elections
Kodangal
Revanth Reddy
  • Loading...

More Telugu News